ముస్లింలు అక్కడ నమాజ్‌ చేయొద్దు: యోగి

17 Aug, 2017 12:24 IST|Sakshi
ముస్లింలు అక్కడ నమాజ్‌ చేయొద్దు: యోగి

లక్నో: రోడ్లపై నమాజ్‌ చేయొద్దని ముస్లింలను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. రంజాన్‌ పర్వదినం రోజున రోడ్లపైకి వచ్చి నమాజ్‌ చేయడం సరి కాదని యోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను తాను ఇలా అడగకపోతే ఉత్తరప్రదేశ్‌ పోలీసు స్టేషన్లలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడం ఆపేయాలని తాను కోరలేనని అన్నారు.

గత ప్రభుత్వం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగా నిర్వహించలేదని చెప్పుకొచ్చిన ఆయన.. ఇక నుంచి అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుందామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ తమ పండుగల రోజుల ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చని యోగి పేర్కొన్నారు. పోలీసు వ్యవస్ధలో మార్పు తెచ్చేందుకు కీర్తనలు, ప్రార్థనలు ఉపయోగపడతాయని యోగి వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది.

మరిన్ని వార్తలు