రైతు ప్రయోజనాలపై రాజీ లేదు: కేంద్రం

6 Aug, 2014 02:59 IST|Sakshi
రైతు ప్రయోజనాలపై రాజీ లేదు: కేంద్రం

ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇదే చెప్పాం
కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడి

 
న్యూఢిల్లీ: నిరుపేద రైతులు, వినియోగదారుల ప్రయోజనాల విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)తో రాజీ పడబోమని కేంద్రం చెప్పింది. ధాన్యాల భారీ నిల్వ అంశంపై పూర్తి తీర్మానాన్ని అందజేయూల్సిందిగా డబ్ల్యూటీవోను కోరామంది. దేశ ఆహార భద్రతా కార్యక్రమాన్ని అవరోధాలూ లేకుండా అమలు చేయడానికి ఇది అవశ్యకమని పేర్కొంది. అనిశ్చితి, అస్థిరత్వం కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార భద్రత అనేది మానవతా పరమైన అంశమని, వ్యాపారపరమైన సౌలభ్యాల కోసం దాన్ని పణంగా పెట్టలేమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. ఇటీవలి డబ్ల్యూటీవో జెనీవా చర్చలు విఫలం కావడానికి కారణమైన ప్రభుత్వ వైఖరిని  సమర్థించుకున్నారు. సంపన్న దేశాలకు ప్రీతిపాత్రమైన ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంటును (టీఎఫ్‌ఏ) అంగీకరించరాదని నిర్ణరుుంచినట్లు తెలిపారు. ఆహార సబ్సిడీ అనేది ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి విలువలో 10 శాతం మేరకే ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు స్పష్టం చేస్తున్నారుు. అరుుతే ఎలాంటి జరిమానాలకు ఆస్కారం లేకుండా.. కనీస మద్దతు ధరకు ఆహారధాన్యాలు సేకరించి వాటిని చవక ధరలకు విక్రరుుంచేందుకు వీలు గా వ్యవసాయ సబ్సిడీల లెక్కింపు నిబంధనలు సవరించాలని మన దేశం డిమాండ్ చేస్తోంది.

ప్రజలకు చేరవేయండి: బీజేపీ

రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రజలకు తెలియజేయూలని బీజేపీ తమ ఎంపీలను కోరింది. ఆహార భద్రత అంశంపై డబ్ల్యూటీవోతో జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వివరించారు. ఇలావుండగా సీశాట్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయూన్ని కూడా ఆయన వెల్లడించారు. ఈ సమావేశం వివరాలను బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులకు తెలియజేశారు.
 
 

మరిన్ని వార్తలు