-

భారతీయ మహిళలు ఎంత పనిచేస్తారో తెలుసా?

27 Oct, 2016 20:25 IST|Sakshi
భారతీయ మహిళలు ఎంత పనిచేస్తారో తెలుసా?
పని చేయడంలో మగవాళ్ల కంటే మగువలు ముందుంటారని పరిశోధకులు చెబుతున్నారు. రోజు మొత్తమ్మీద మగవాళ్ల కంటే ఆడాళ్లే ఎక్కువ సేపు పనిచేస్తారట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సగటున ఏడాదికి మహిళలు 39 రోజులు ఎక్కువ పనిచేస్తారు. అదే భారతదేశంలో అయితే 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని అంటున్నారు. సగటున పురుషుల కంటే మహిళలు 50 నిమిషాలు ఎక్కువగా పనిచేస్తారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక తెలిపింది. ప్రపంచంలో కేవలం ఆరు దేశాలలో మాత్రమే మహిళల కంటే పురుషులు ఎక్కువ గంటలు పనిచేస్తారట. అయితే వీటిలో మూడు దేశాల్లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను పురుషులు, మహిళలు సమానంగా పంచుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగానికి వెళ్తే, మరొకరు పిల్లల సంరక్షణ బాధ్యతను చూసుకుంటారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్న వెసెలినా రచేవా చెప్పారు. 
 
మహిళల కంటే పురుషులకు 34 శాతం వరకు ఎక్కువ జీతాలున్నా, మహిళలే ఎక్కువ సేపు పనిచేస్తున్నారంటున్నారు. చాలావరకు ఇంటి పని, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ లాంటి పనులు చేస్తున్నా, వాటికి జీతభత్యాలు ఏమీ ఉండవని చెప్పారు. దీంతో కలిపి చూసుకుంటేనే ఏడాది మొత్తమ్మీద పురుషుల కంటే ఎక్కువసేపు మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. భారతదేశం, పోర్చుగల్, ఈస్టోనియా దేశాల్లో మహిళలు ఏడాది మొత్తమ్మీద 50 రోజులు ఎక్కువ పనిచేస్తున్నారన్నారు.
మరిన్ని వార్తలు