భారత్‌లోనే అత్యంత చెత్త నగరం

2 Oct, 2017 13:38 IST|Sakshi

పర్వతాల్లో పేరుకున్న చెత్త

మూసుకుపోయిన నాలాలు

పట్టించుకోని అధికారులు

యూపీ రాజధాని లక్నోకు కూతవేటు దూరంలో..!

నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఇచ్చిన మొదటి నినాదం స్వచ్ఛ భారత్‌. మోదీ ఎంతో కలలు ప్రాజెక్టుగా కూడా దీనిని గురించి గొప్పగా చెప్పుకుంటాయి బీజేపీ శ్రేణులు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా సిటీ.. దేశంలో అత్యంత చెత్త సిటీగా నిలిచింది.

సాక్షి, గోండా సిటీ: ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లక్నోకు 125 కిలో మీటర్ల దూరంలో గోండా సిటీ ఉంది. ఇక్కడ చెత్త పర్వతాకారంలో పేరుకుని ఉంటుంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుని.. మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఎటు చూసినా మురికి కూపాలే... ఈ నగరాన్ని చెత్త నగరాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకోవచ్చని కొందరు స్థానికులు అంటున్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా కేంద్రం ఎంచుకున్న 434 నగరాల్లో ఈ సిటీ కూడా ఉండడం గమనార్హం.

మురికి కూపాలు దోమలకు, పందులకు ఆవాసాలుగా మారిపోయాయి. మురుగు నీరు ప్రవహించని రోడ్లు నగరంలో ఒక్కటంటే ఒక్కటికూడా లేదని దుర్గేష్‌ మిశ్రా అనే స్థానికుడు చెబుతున్నాడు. స్థానిక మున్సిపల్‌, ప్రభుత్వాధికారుల అవినీతి వల్లే నగరం ఇలా ఉందని ఆయన అంటున్నారు. 

మరిన్ని వార్తలు