అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో విచారణ

23 Feb, 2018 01:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్‌ చేస్తూ ‘రేలా’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) గురువారం విచారించింది. రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుపుతున్న ఇసుక తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది.

అయితే దీనికి సంబంధించి రెండు ప్రభుత్వాలు ఇచ్చిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని జస్టిస్‌ రఘువేంద్ర ధర్మాసనం పేర్కొంది. గోదావరి జిల్లాల్లో డ్రెడ్జింగ్‌ కార్యకలాపాలను నిషేధించాలని దాఖలైన మరో కేసును కూడా ఇదే కేసులో కలిపి విచారిస్తామని పేర్కొంది. ఇసుక  తవ్వకాలు జరుపుతున్న సంస్థలు, ఇసుక వినియోగానికి సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు