స్మారక మందిరంగా జయలలిత నివాసం

28 May, 2020 06:05 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం,  దివంగత జయలలిత నివసించిన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చాలని మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తులపై ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌లకూ వారసత్వపు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రైవేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పుహళేంది (ప్రస్తుతం పార్టీతో రాజీ), జానకిరామన్‌ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది.

మరిన్ని వార్తలు