వెల్డింగ్ కార్మికుడి కుమారుడికి రూ.కోటి జాబ్ ఆఫర్

6 Feb, 2016 02:19 IST|Sakshi

కోటా(రాజస్తాన్): ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చివరి సంవత్సరం విద్యార్థి అయిన 21 ఏళ్ల వాత్సల్య సింగ్‌కు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి రూ.1.02 కోట్ల వార్షిక ప్రారంభ వేతనం ఆఫర్ లభించింది. వాత్సల్య తండ్రి బిహార్‌లోని ఓ మారుమూల గ్రామం ఖగారియాలో వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆలిండియా 382 ర్యాంక్ సాధించిన వాత్సల్య ఈ ఏడాది అక్టోబర్‌లో అమెరికాలో ఉద్యోగంలో చేరతాడని ఐఐటీ ఖరగ్‌పూర్ డెరైక్టర్ పార్థ చక్రవర్తి వెల్లడించారు.

తన కుమారుడికి ఇంత పెద్ద ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని వాత్సల్య తండ్రి చంద్రకాంత్ సింగ్ చౌహాన్ అన్నారు. చదువులో వెనుకబడి ఇంటికెళ్లిపోదామనుకున్న తనను ప్రోత్సహించి ఇంత వాడిని చేసిన ఇద్దరు అధ్యాపకులకు జీవితాంతం రుణపడి ఉంటానని వాత్సల్య ఉద్వేగంతో చెప్పాడు.

మరిన్ని వార్తలు