అస్తిపంజరాలు లభించిన మాట నిజమే

17 Oct, 2016 21:15 IST|Sakshi
అస్తిపంజరాలు లభించిన మాట నిజమే

డెహ్రాడూన్: మూడేళ్ల క్రితం ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన కేదార్‌నాథ్‌ ఆలయం వద్ద అనేక అస్తిపంజరాలు లభించిన మాట నిజమేనంటూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి హరీశ్‌రావత్‌ ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘మొత్తం 31 అస్తిపంజరాలు దొరికాయి. అందులో 21 అస్తిపంజరాలకు అంత్యక్రియలు నిర్వహించాం. మిగతా ఎనిమిది మృతదేహాలకు మంగళవారం చేస్తాం’ అని చెప్పారు. దీనితో నాకేమీ సంబంధం లేదు. నాకు ముందు అధికారంలో ఉన్న విజయ్‌ బహుగుణ గాలింపు చర్యలను నిలిపివేశారు. గాలింపు చర్యలు చేపట్టలేదంటూ ఇల్లెక్కి అరిచేవాళ్లంతా ఈ విషయమై ఆయననే నిలదీయాలి’ అని అన్నారు.

కేదార్‌నాథ్‌ ఆలయం సమీపంలో అనేక అస్తిపంజరాలు లభ్యమయ్యాయంటూ వార్తలు రావడం తెలిసిందే. 2013లో ఏకబిగిన కుండపోతగా వర్షం కురియడంతో అనేక భవనాలు కూలిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కొండ పైభాగానికి వెళ్లారు. అయితే అక్కడ ఆహారం, నీరు దొరకకపోవడంతో చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు