ఆయనొక నియంత..

27 Mar, 2015 17:04 IST|Sakshi
ఆయనొక నియంత..

న్యూఢిల్లీ:  ఆప్లో  విభేదాల సెగ మరింత రగులుతోంది. ఆప్ అధినేత, ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్పై ఆప్ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడిన  ఇరువురు ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలతో విరుచుపడ్డారు.   కేజ్రీవాల్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వరాజ్య పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీలో స్వరాజ్యం ఉందా అని వారు ప్రశ్నించారు.

 

తనను ప్రశ్నించేవారిని కేజ్రీవాల్ సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య మానవుడికి అధికారం, అవినీతి నిర్మూలన లాంటి సదుద్దేశాలతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని పేర్కొన్నారు.  తమ పార్టీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు సామాన్యుడికి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. అలాంటి పార్టీ ఆశయాలను నీరుగార్చే ప్రయత్నాలను సహించమనీ. పార్టీని రక్షించుకోవడానికి పోరాడతామన్నారు. కేజ్రీవాల్ను జాతీయ కన్వీనర్గా  రాజీనామా చేయాలని తాము కోరలేదని మరోసారి  స్పష్టం చేశారు.  మేం పదవి, అధికారం, సాయం  కోరడంలేదు. పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించి మా డిమాండ్లను తీరిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు