-

ఇంగ్లీషులో మాట్లాడాడని..

12 Sep, 2017 15:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆంగ్లంలో మాట్లాడడం  తప్పనిసరిగా మారిపోయిన ప్రస్తుత  సామాజిక పరిస్థితుల్లో  మనం జీవిస్తున్నాం.  కేవలం ఆంగ్లంలో మాట్లాడడమే కాదు.. మరింత పరిజ్ఞనాన్ని అలవర్చుకోవడం చాలా అవసరం. అయితే విచిత్రంగా  ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటమే ఓ యువకుడికి చేదు అనుభవంగా మిగిల్చింది.  దేశరాజధాని  ఢిల్లీ నగరంలో కన్నాట్‌ ప్లేస్‌లో శనివారం ఉదంతం చోటు చేసుకుంది. 

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నోయిడా నివాసి వరుణ్ గులాటి (22)  తన స్నేహితుడితో కలిసి స్థానిక  ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కివెళ్లాడు. ఫ్రెండ్ దన్ కారులో తన స్నేహితుడు అమన్‌ను  విడిచిపెట్టడానికి పెట్టిన అనంతరం తిరిగి వెళుతుండగా   అయిదుగురు వ్యక్తులు గులాటిని చుట్టుముట్టారు. ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడుతున్నావంటూ వాదనకు దిగారు.   ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య  వాగ్వాదం చేసుకుంది. దీంతో వారు తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు.  అనంతరం అక్కడినుంచి పారిపోయారు.  అయితే గులాటి అప్రమత్తంగా వ్యవహరించి  దుండగుల వాహనాల నెంబర్లను  నోట్‌ చేసుకోవడంతో  నిందితుల్లో ముగ్గురు పోలీసులకు చిక్కారు.
 
బాధితుడి  ఫిర్యాదు, వాహనాల నెంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ముగ్గరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని  పోలీసులు తెలిపారు. మిగిలినవారికోసం గాలిస్తున్నామన్నారు.




 

మరిన్ని వార్తలు