గుండు కొట్టించి, గాడిదపై ఊరేగించారు

30 Jan, 2016 11:46 IST|Sakshi
గుండు కొట్టించి, గాడిదపై ఊరేగించారు

లక్నో: బలవంతంగా మతమార్పిడికి పాల్పడ్డాడనే  ఆరోపణలతో  ఓ వ్యక్తిని  దారుణంగా అవమానించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని  ఒరాయ్ జిల్లాలో ప్రకంపనలు రేపింది.   జలౌన్ జిల్లాకు చెందిన ఆద్వేష్ అనే వ్యక్తికి  గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి  పట్టపగలు, నడి వీధుల్లో ఊరేగించారు.

వివరాల్లోకి వెళితే ముగ్గురు హిందువులను క్రైస్తవ మతం లోకి  మార్చి, వారితో బీఫ్  తినిపించారనే  ఆరోపణలతో భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ చేసి వారిని సత్సంగ్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడంటూ వీరంగం సృష్టించారు.  దాదాపు 200 మంది కార్యకర్తలు  జలౌన్ జిల్లాలోని ఆద్వేష్ సవిత ఇంటిపై దాడి చేశారు.  అతడిని బలవంతంగా బయటికి లాక్కొచ్చి, గుండు కొట్టించారు. కనుబొమ్మలు,  మీసాన్ని  సైతం తీసివేయించారు. అనంతరం గాడిదపై  ఊరేగిస్తూ ఒరాయ్ జిల్లాకు తీసుకొచ్చారు.

మరోవైపు బాధితుల  ఫిర్యాదు మేరకు ఈ సంఘటపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  అయితే  ఇప్పటివరకు  ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం.


 

మరిన్ని వార్తలు