‘దేశ రాజధానిలో.. ఏం జరుగుతోంది’

16 Nov, 2018 15:41 IST|Sakshi

ఆప్‌ నేత ఇంటిపై బుల్లెట్ల వర్షం..!!

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతపై గురువారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. 20 నుంచి 25 మంది దుండగులు తుపాకులతో తన ఇంటిపై దాడి చేశారని కౌన్సిలర్‌ (దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌) జితేందర్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. ఇంటి బయటనున్న కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారనీ, ఇంట్లోకి దూరేందుకు యత్నించారని వెల్లడించారు. కొంత సేపటి తర్వాత ‘నీ అంతు చూస్తాం’ అంటూ హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. (ఆయనకు మాత్రమే ఫ్రెష్‌ ఎయిర్‌ కావాలా..!!) 

‘వ్యక్తిగతంగా నాకు ఎవరితో విభేదాలు లేవు. ఇది రాజకీయ ప్రత్యర్థులు నాపై చేసిన కుట్ర’ అని జితేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ‘అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది’ అని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో.. అదీ పట్టపగలు సాయుధుల గుంపు ఓ ప్రజా ప్రతినిధిని హత్య చేసేందుకు పూనుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

(చదవండి : 16 మందితో ఆప్‌ మూడో జాబితా)

మరిన్ని వార్తలు