ఈశాన్య రాష్ట్రాలకు మోదీ భరోసా

29 Jan, 2019 10:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్ల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న క్రమంలో అసోం ప్రయోజనాలను తమ పార్టీ పరిరక్షిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. గిరిజన స్వయంప్రతిపత్తి మండళ్లలో బీజేపీకి బాసటగా నిలిచిన ప్రజలకు ప్రధాని ట్విటర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అసోంలో మూడు గిరిజన మండళ్లకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీకి అండగా నిలిచిన అసోం సోదర, సోదరీమణులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రధాని మంగళవారం ట్వీట్‌ చేశారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి బీజేపీ కట్టుబడిఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు చర్యలు, పథకాల ద్వారా అసోం ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. కాగా పౌరసత్వ బిల్లు (సవరణ) 2019ను వ్యతిరేకిస్తున్న ఈశాన్యరాష్ట్రాలకు చెందిన పలు బీజేపీ భాగస్వామ్య పార్టీలు మంగళవారం గౌహతిలో భేటీ అయ్యాయి.

>
మరిన్ని వార్తలు