అవి రెండూ అవినీతి పత్రాలే..

26 Dec, 2023 01:02 IST|Sakshi
వాజ్‌పేయికి నివాళులర్పిస్తున్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు

శ్వేత, స్వేద పత్రాలపై కిషన్‌రెడ్డి ధ్వజం 

కోవిడ్‌ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేశామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ స్వేద పత్రం.. రెండూ అవినీతి పత్రాలేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఆ రెండు పత్రాలు కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకేనని నిందించారు. భారతరత్న, దివంగత మాజీ ప్రధాని అటల్‌ బి­హా­రీ వాజ్‌­పే­యి జయంతిని పురస్కరించు­కుని ఆయ­న చిత్రపటానికి పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే టి.­రాజాసింగ్‌ ఇతరనేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ మాట్లాడుతూ... వాజ్‌పేయి జయంతిని కేంద్రం సుశాసన్‌ దినోత్సవ్‌ పేరుతో నిర్వహిస్తోందన్నారు. ఒక్క ఓటు తగ్గినా.. నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవికి వాజ్‌ పేయి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వాజ్‌పేయి ఆకాంక్షించారని, త్వరలోనే ఆయన కల సాకారం కాబోతుందన్నారు.

దేశంలో సుపరిపాలనకు ఆద్యుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంత్యోదయ నినాదంతో వాజ్‌పే­యి దేశంలో సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా వాజ్‌పేయి చూపిన మార్గంలో.. నడుస్తోందని పేర్కొన్నారు.  

కొత్త వేరియెంట్‌ ప్రమాదకరం కాదు.. 
కోవిడ్‌ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. అ­వసరాన్ని బట్టి కోవిడ్‌ కంట్రోల్‌ రూం ఏ­ర్పాటు చేస్తామని చెప్పారు. వాజ్‌పేయి జ­యంతి సందర్భంగా ఫీవర్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పా­ల్గొ­న్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొత్త వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందని.. అయితే ప్రమాదకరం కా­ద­ని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు.ప్ర­­­జ­­లు ఆందోళన చెందకుండా కోవిడ్‌ కట్టడికి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు