వారిద్దరూ.. చేతులు కలిపారు

27 Nov, 2014 13:57 IST|Sakshi
వారిద్దరూ.. చేతులు కలిపారు

కఠ్మండ్ : సార్క్ శిఖరాగ్ర సదస్సులో నిన్న ఎడమొహం, పెడమొహంగా కనిపించిన భారత్, పాక్ ప్రధానులు గురువారం ఎట్టకేలకు చేయి చేయి కలిపారు. ఖాట్మండులో జరుగుతోన్న సార్క్‌ సమావేశాల రెండోరోజు  వారిద్దరూ కరచాలనం చేసుకుని... బాగోగులు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర బహదూర్ పాండే ధ్రువీకరించారు.  బుధవారం సాయంత్రం నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా ఇచ్చిన విందులో పాల్గొన్న వీరు రిసెప్షన్ గదిలో కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలిపారు.  

కాగా ఈ సదస్సులో 26/11 ముంబై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో నవాజ్‌ షరీఫ్‌ ఇబ్బందుల్లో పడ్డారు. ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్న మోడీ పిలుపును సార్క్‌ దేశాలు ఆహ్వానించడం కూడా షరీఫ్‌ ఇబ్బందులను పెంచినట్లు అయ్యింది.

మరిన్ని వార్తలు