మణిపూర్ అఖిలపక్షానికి మోదీ ఆహ్వానం

2 Jun, 2016 19:18 IST|Sakshi
ఇంపాల్: అక్రమ వలసదారుల నిరోధానికి సంబంధించిన మూడు బిల్లులపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ అఖిల పక్ష ప్రతినిధి బృందానికి ఆహ్వానం పంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఒకారమ్ ఇబోబి గురువారమిక్కడ తెలిపారు. ఈ మూడు బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ గత ఏడాదే ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను గిరిజన తెగకు చెందిన ఓ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రధాని అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం ఒకారమ్ ఇబోబి మాట్లాడుతూ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఏ బిల్లును అయినా సవరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
 
మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా, మద్దతుగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి.  గతంలో వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 9 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. ప్రధాని అపాయింట్ మెంట్ జాప్యంపై ప్రశ్నించగా ప్రధానికి దేశ, విదేశీ సమస్యలు ఎన్నో ఉంటాయని  ఇబోబి అన్నారు. 

 

మరిన్ని వార్తలు