‘వాహన’ నేరాలకూ ఐపీసీ వర్తింపు: సుప్రీం

8 Oct, 2019 04:56 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహనాలను అధిక వేగంతో నడపడం, బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్‌ వంటివి మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించి చేసే నేరాలు. అయితే మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ రెండూ వాటి పరిధుల్లో చక్కగానే పనిచేస్తున్నాయని, ప్రమాదాల సమయంలో చట్టరీత్యా ఎదుర్కోవాల్సిన విచారణలో కూడా రెండూ సరిగ్గానే ఉన్నాయని అ. మోవా చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమంటూ 2008 డిసెంబరు 22న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారిస్తూ సుప్రీంకోర్టు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ఈ కేసును విచారించింది.  మోటారు చట్టంలో ఐసీపీని ప్రవేశ పెట్టొద్దంటూ అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్, గౌహతి హైకోర్టు ఇచ్చిన సూచనలను పక్కన పెట్టింది.  

మోటారు చట్టం చెప్పలేదు...
బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్, అధిక వేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించినా, తీవ్రంగా గాయపడినా వారికి పడాల్సిన శిక్షపై మోటారు చట్టంలోని చాప్టర్‌ 8 క్షుణ్నంగా వివరించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఐపీసీ సెక్షన్‌ 279, 304 పార్ట్‌–2, 304ఏ, 337, 338లు వివరించాయని తెలిపింది. మోటారు చట్టంలోని చాప్టర్‌ 8 వాటి వల్ల జరిగే ప్రమాదాలన్నింటిని కలిపి చెప్పిందని పేర్కొంది. వాహన చట్టంలోకి ఐపీసీ అవకాశం ఇస్తే క్రిమినల్‌ చట్టం కూడా మోటారు చట్టంలో ప్రవేశిస్తుందని తెలిపింది. 

మరిన్ని వార్తలు