ఆయుర్వేద చాక్లెట్లలో గంజాయి!

9 Jul, 2016 19:54 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో విద్యాసంస్థలకు సమీపంలోని దుకాణాల్లో అమ్మే ఆయుర్వేద చాక్లెట్లలో మత్తుపదార్థం కలిసి ఉన్నట్లు తేలింది. దీంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు దుకాణాలపై దాడులు చేస్తున్నారు. ఉత్తర చెన్నైకి చెందిన 9వ తరగతి విద్యార్థి ఒకరు గురువారం ఉదయం ఆయుర్వేద చాక్లెట్ తిని మైకంలోకి జారుకోవడంతో ఎగ్మూరులోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. ఆ చాక్లెట్లలో గంజాయి మత్తుపదార్థం కలిపి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

నిషేధిత మత్తుపదార్థాలైన పాన్‌మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, కార్యాలయాలపై చెన్నై ఆదాయపు పన్నుశాఖ అధికారులు శుక్రవారం దాడులు జరిపి ఓ గిడ్డంగి నుంచి రూ.300 కోట్ల విలువైన నల్లధనం, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గిడ్డంగి యజమాని అంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని నిర్ధరించారు.
 

మరిన్ని వార్తలు