తెల్లటి కుర్తా.. ఎర్రటి తలపాగా

16 Aug, 2014 11:30 IST|Sakshi
తెల్లటి కుర్తా.. ఎర్రటి తలపాగా

మొట్టమొదటి సారిగా ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రాజసం ఉట్టిపడే ఎర్రటి తలపాగాను కట్టుకున్నారు. ఆయన కట్టుకున్న దాన్ని జోధ్పురి బంధేజ్ సఫా అంటారు. సాధారణంగా రాజపుత్రులు ఎక్కువగా ఉండే రాజస్థాన్లోని మేవాడ్ ప్రాంతంలోను, దానికి పొరుగున ఉండే గుజరాత్లోని కొన్ని జిల్లాల్లోను ఈ తలపాగా కనపడుతుంది.

దర్పానికి, గౌరవానికి చిహ్నంగా ఉండే ఈ తలపాగాను రాజకుటుంబాల వాళ్లు అత్యంత ముఖ్యమైన సందర్భాలలో.. అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు, పెళ్లి సమయాల్లో మాత్రమే ఈ రకం తలపాగా ధరిస్తారు. ఆకుపచ్చటి అంచు ఉన్న ఎర్రటి తలపాగాలో మోడీ తన రాచరిక దర్పాన్ని ఒకవైపు ప్రదర్శిస్తూనే.. మరోవైపు తాను భారతీయులందరి ప్రధాన సేవకుడినని చెప్పారు. ఇంతకుముందు గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు సామాన్య రైతులు ధరించే తలపాగాను ధరించి ప్రసంగించారు.

మరిన్ని వార్తలు