కరోనా: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

16 Jun, 2020 11:27 IST|Sakshi

భువనేశ్వర్‌: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న వేళ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా‌ కేసుల నిర్ధారణ కోసం 45 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సర్వే చేపట్టాలని నిర్ణయించింది. జూన్‌ 16 వతేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఇంటింటా సర్వే చేస్తూ.. శాంపిల్స్‌ను సేకరించనున్నట్లు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్‌ శాలినీ పండిట్‌ వెల్లడించారు. మంగళవారం రోజున ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ కేసుల వివరాలను సేకరించనుంది. ఆశా, ఏఎన్‌ఎం కార్యకర్తల ద్వారా ఇంటింటా సర్వేచేపట్టనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో కరోనా‌ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించడం వల్ల వీలైనంత వేగంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. కాగా ఇప్పటిదాకా.. ప్రాంతీయ వైద్యపరిశోధనా కేంద్రం (ఆర్‌ఎంఆర్‌సీ) సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 17 ప్రయోగశాలల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. జూన్‌ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 2 లక్షలు దాటినట్లు శాలినీ పండిట్‌ పేర్కొన్నారు. 
చదవండి: కరోనా: మగవాళ్లలోనే ఎందుకు మరణాలు ఎక్కువ? 

మరిన్ని వార్తలు