మారిన అడ్వకేట్ల డ్రస్‌ కోడ్‌

15 May, 2020 12:50 IST|Sakshi

భువనేశ్వర్‌: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తోన్నాయి. అత్యవసర సర్వీసులు వారు తప్ప మిగిలిన వారందరూ ఇంటి దగ్గర నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ చేపడుతున్నాయి. సాధారణంగా అడ్వకేట్లు అంటే నల్లని కోర్టు వేసుకొని కేసులు వాదిస్తూ ఉంటారు. అయితే ఒడిషా హైకోర్టు మాత్రం ఇకపై లాయర‍్లందరూ తెల్లని వస్త్రాలు ధరించి తమ వాదనలు వినిపించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం)

వర్చువల్‌ కోర్టు సిస్టమ్‌ ద్వారా అడ్వకేట్లందరూ కోర్టు ముందు హాజరవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోన్న ఈ తరుణంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్లాక్‌కోర్టుని, గౌన్‌ను ధరించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. తెల్ల షర్ట్‌, తెల్లసెల్వార్‌కమీజ్‌,  తెల్లటి చీరలో కోర్టు ముందు హాజరు కావాలని  ఒడిషా హైకోర్టు ఆదేశాలు జారిచేసింది. దీంతోపాటు బుధవారం నాడు వాదనలు వినే జడ్జీలు పొడుగాటి గౌన్లు ధరించాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (కోల్కతా నగర వీధుల్లోకి ఎల్లో టాక్సీలు)

మరిన్ని వార్తలు