బీజేపీ సీఎంలపై స్వామి అగ్నివేష్‌ సంచలన వ్యాఖ్యలు

2 Dec, 2017 09:44 IST|Sakshi

సాక్షి, చండీఘఢ్‌ : సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన చిత్రం ‘పద్మావతి’పై వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా కోవలోకి ప్రమఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేష్‌ చేరారు. అయితే స్వామి అగ్నివేష్‌ పద్మావతి చిత్రానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. దేశంలో సినిమా,  సమాచార ప్రసార సాధనాలు, సోషల్‌ మీడియాపై పరిమిలు విధించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం పద్మావతిపై జరగుతున్న వివాదాన్ని.. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలోనే చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

పద్మావతి చిత్ర వివాదం.. నిషేధం, వివాదాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయని.. వీటికి గుజరాత్‌ ఎన్నికల దృష్టిలో చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని స్వామి అగ్నివేష్‌ చెప్పారు. ఇటేవంటి చర్యల వల్ల బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకేచోటకు చేరే అవకాశం ఏర్పడుతుందని.. అందుకు ‘పద్మావతి’ చిత్రం సహకరించేలా ఉందని ఆయన చెప్పారు.
పద్మావతి చిత్రాన్ని ఆయా రాష్ట్రాల్లో నిషేధించిన గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రాజస్తాన్‌ ముఖ్యంత్రి వసుంధర రాజే సింధియా, ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు.. ముందు సినిమా చూడాలని ఆయన హితవు పలికారు.

మరిన్ని వార్తలు