40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాకిస్తాన్

30 Nov, 2014 15:00 IST|Sakshi

పట్టారి(పంజాబ్): పాకిస్తాన్ 40 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. వారిలో గుజరాత్కు చెందిన 35 మంది మత్స్యకారులు కూడా ఉన్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అధికారులు చెప్పారు. పాకిస్తాన్కు చెందిన సరిహద్దు భద్రతా దళం అధికారులు  శనివారం ఖైదీలను అట్టారి-వాఘా చెక్పోస్ట్ వద్దకు తీసుకువచ్చారు. వారిని ఇక్కడి బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు.

పాకిస్తాన్ జలాలలోకి వెళ్లినందుకు మత్స్యకారులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 40 మంది ఖైదీలలో ఎక్కువ మంది ఏడాదిగా పాకిస్తాన్ జైళ్లలో ఉన్నారు.
**

మరిన్ని వార్తలు