పోలీస్‌శాఖకే ఒక మచ్చ

24 Jul, 2014 23:33 IST|Sakshi
పోలీస్‌శాఖకే ఒక మచ్చ

 వివాహేతర  సంబంధాలు ఎంతటి ఘాతుకానికి దారితీస్తాయో చిదంబరం అన్నామలైనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌గా పనిచేస్తున్న గణేష్ (31) హత్యోదంతం కలకలం రేపింది. ఇది అసెంబ్లీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. పోలీస్‌శాఖకే ఒక మచ్చగా మారడంతో ఎస్‌ఐ అంత్యక్రియలకు అధికారులు గైర్హాజరయ్యారు.  
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: పోలీస్‌శాఖలో చేరాలన్న తన కలను నెరవేర్చుకున్న గణేష్, ఎస్‌ఐ హోదాను నిం డా నాలుగేళ్లు కూడా అనుభవించకముందే హత్యకు గురయ్యూడు. నాలుగేళ్లలోనే ఉద్యోగం, పెళ్లి, చావు వెంటవెంటనే అన్నీ తరుముకు వచ్చాయి. చిదంబరం సమీపం సీ ముట్టలూరుకు చెందిన  వనిత (నిందితురాలు), తయ్యాపురానికి చెందిన బేల్దారీ మేస్త్రీ కలైమణి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి శబరి (7) అనే కుమారుడున్నాడు. మినీ బస్సులో కొడుకును స్కూలుకు వదిలి వచ్చే క్రమంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా మరికొంతమందితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముస్లిం యువతి వలె నల్లని ముసుగు ధరించి ఒక యువకునితో వెళుతుండగా ముస్లిం మహిళలు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
 
 ఈ క్రమంలోనే 2011లో కిళ్లై పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐగా ఉన్న గణేష్ వనిత అందాలకు దాసుడయ్యూడు. ఈ వ్యవహారం బయటపడితే కుటుంబ పరువు పోతుందని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. మెడికల్ సెలవు పెట్టిన ఎస్‌ఐ, వనితతో కలిసి అనేక విహార యాత్రలు చేశారు. ఖరీదైన కొత్త దుస్తులు కొనిచ్చారు. అంతేగాక తన ఎస్‌ఐ యూనిఫారాన్ని సైతం వనితకు తొడిగి ఆనందించారు. ఉల్లాసంగా గడుపుతున్న సమయాన్ని ఒకరికి తెలియకుండా ఒకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించుకున్నారు. బ్రహ్మచారిగా అపార్టుమెంటులో ఒంటరిగా నివసిస్తున్న గణేష్, వనిత వ్యామోహంలో పూర్తిగా పడిపోయాడు. వీరిద్దరి వ్యవహారం వనిత భర్తకు తెలియడంతో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భర్తకు విడాకులచ్చి వస్తే పెళ్లి చేసుకుంటానని వనితకు వాగ్దానం చేశాడు.
 
 ఒక ఎస్‌ఐ తనకు భర్త కాబోతున్నాడన్న ఆనందంలో నాలుగు నెలల క్రితం విడాకులు మంజూరు చేయించుకుని ఆమె గణేష్ పంచన చేరిపోయింది. మెడికల్ లీవు ముగించుకుని గత నెల 18న గణేష్ తిరిగి విధుల్లో చేరారు. పెద్ద కట్నంపై ఆశతో వళుదరెట్టైకి చెందిన సత్యను పెద్దల సమక్షంలో ఈనెల 9న పెళ్లి చేసుకున్నారు. గణేష్ మాటలను నమ్మి భర్తకు విడాకులిచ్చిన వనిత తాను దారుణంగా మోసపోయానని గుర్తించి కక్షపెంచుకుంది. ఆడి(ఆషాడ)మాసం కారణంగా ఎస్‌ఐ భార్య సత్య పుట్టింటికి వెళ్లి ఉండగా ఈనెల 22న వనిత గణేష్ అపార్టుమెంటుకు చేరుకుని మద్యం తాగించింది. తనకు దక్కని గణేష్ మరెవ్వరికీ దక్కరాదని తలచి మద్యం మత్తులో పడివున్న గణేష్‌ను వేటకొడవలితో గొంతుకోసి హతమార్చింది. గణేష్‌ను నేనే చంపేశాను, అతను నయవంచకుడురూ. అంటూ పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది.
 
 ప్రతిపక్షాల ప్రస్తావన-జయ జవాబు
 ఎస్‌ఐ గణేష్ హత్య, వనిత అరెస్ట్ గురువారం అసెంబ్లీలో ప్రధాన చర్చగా మారింది. ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల హతం కావడం పోలీస్ శాఖను బజారుకీడ్చిందంటూ డీఎండీకే సభ్యులు చంద్రకుమార్, సీపీఎం సభ్యులు బాలకృష్ణన్, సీపీఐ సభ్యులు పొన్నుపాండి, కాంగ్రెస్ సభ్యులు రంగరాజన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇందుకు సీఎం జయలలిత బదులిస్తూ, హతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా కేసులు బనాయించాలని ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు ఎస్‌ఐ గణేష్ భౌతికకాయానికి విళుపురం జిల్లా ఉళుందూర్‌పేటలోని స్వగ్రామంలో 23వ తేదీ సాయంత్రం పోలీసు సంప్రదాయం ప్రకారం తుపాకులతో గాలిలో 21 రౌండ్లు పేల్చగా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు అధికారులు ఎవ్వరూ హాజరుకాకుండా అంత్యక్రియలను బహిష్కరించారు.
 

మరిన్ని వార్తలు