గర్భం.. అనుకోకుండా రాదు: హైకోర్టు

13 Jun, 2016 20:57 IST|Sakshi
గర్భం.. అనుకోకుండా రాదు: హైకోర్టు

తిరువనంతపురం:
గర్భం దాల్చిన విద్యార్థినులకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు జడ్జి ఒకరు వ్యాఖ్యానించారు. గర్భం దాల్చడం అనుకోకుండా జరిగే విషయం కాదని, అందువల్ల గర్భం దాల్చిన విద్యార్థినులకు హాజరు తగ్గినంత మాత్రాన వాళ్లకు మినహాయింపు అవసరం లేదని జస్టిస్ కె. వినోద్ చంద్రన్ అన్నారు.

కన్నూర్ యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్న జాస్మిన్ ప్రెగ్నెంట్తో ఉన్నందున తరగతులకు హాజరు కాలేకపోయింది. 75 శాతం అటెండెన్స్ఉండాల్సి ఉండగా, 45 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆమెను పరీక్షలకు అనుమించలేదు. డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్లు చూపించినా జాస్మిన్ రెండో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. దీంతో తరగతుల హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆ విద్యార్థిని కోర్టును ఆశ్రయించింది. రెగ్యులర్ కోర్స్లలో తరగతుల నుంచి మినాహాయింపుకు గర్భిణులకు ఎలాంటి మినాహాయింపులు ఉండవని జాస్మిన్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
 

>
మరిన్ని వార్తలు