రైల్వే అధికారులకు ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ

17 Dec, 2018 13:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సిగ్నల్ ఫెయిల్యూర్‌ను నిరోధించేందుకు కృత్రిమ మేథను ప్రవేశపెట్టిన రైల్వేలు తాజాగా సేవలను మెరుగ్గా, వేగంగా అందించేందుకు సీనియర్‌ అధికారులకు ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో తర్ఫీదు ఇచ్చేందుకు సిద్ధమైంది. రైల్వే అధికారులు ప్రస్తుతం కీలక సందర్భాల్లో పలు కారణాల రీత్యా సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్న క్రమంలో ఈ శిక్షణకు ప్రాధాన్యత ఏర్పడింది.

సవాళ్లతో కూడిన సందార్భలు ఎదురైన సమయంలో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవడంతో ఆ ప్రభావం వారి నిర్ణయాలపై పడుతున్నదని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. భారతీయ రైల్వేలను ప్రక్షాళన చేసే క్రమంలో అంతర్జాతీయంగా పేరున్న శిక్షణా సంస్థ నేతృత్వంలో ఉన్నతాధికారులకు ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ నాయకత్వ వ్యూహాలపై శిక్షణను అందచేస్తామని చెప్పారు.

వదోదరలోని భారతీయ రైల్వేల జాతీయ అకాడమీలో తొలి బ్యాచ్‌లో జనరల్‌ మేనేజర్లు, డివిజనల్‌ రైల్వే మేనేజర్లకు శిక్షణ ఉంటుందని, తర్వాత దశల వారీగా శిక్షణను సీనియర్‌ అధికారులందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు