ఒకే వేదికపై అమితాబ్, రాజ్ ఠాక్రే

23 Dec, 2013 22:42 IST|Sakshi
ఒకే వేదికపై అమితాబ్, రాజ్ ఠాక్రే

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఐదేళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. సినీ కళాకారుల సంక్షేమం కోసం సోమవారం ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. అమితాబ్, రాజ్ ఠాక్రేకు ఘనస్వాగతం పలికారు.

ఐదేళ్ల క్రితం అమితాబ్, రాజ్ ఠాక్రేల మధ్య సంబందాలు దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లో అమితాబ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు భోజ్ పురి సినిమాల్లో నటించడం రాజ్ ఠాక్రేకు ఆగ్రహం తెప్పించింది. అమితాబ్ భార్య జయా బచ్చన్ సమాజ్ వాదీ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. అప్పట్లో జయా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా అమితాబ్, ఠాక్రే మధ్య దూరం పెంచాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ సుదీర్ఘం విరామానంతరం ఒకే వేదికపై కలవడం ఆసక్తికరంగా మారింది.
 

మరిన్ని వార్తలు