రామ మందిరం శంకుస్థాపనకు రండి

19 Jul, 2020 04:28 IST|Sakshi

ప్రధాని మోదీని ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు  

అయోధ్య: అయోధ్యలో భవ్య రామ మందిరం శంకుస్థాపనకు విచ్చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శనివారం ఆహ్వానించింది. రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 3 లేదా 5వ తేదీన పునాది రాయి వేయనున్నట్లు ట్రస్టు అధికార ప్రతినిధి మహంత్‌ కమల్‌నయన్‌ దాస్, అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ వెల్లడిం చారు. నక్షత్రాలు, గ్రహాల కదలికల ఆధారంగా రెండు తేదీలను శుభ ముహూర్తాలుగా నిర్ణయించామని తెలిపారు. వీటిలో ఏదో ఒక తేదీన రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. దేశంలో 10 కోట్ల కుటుంబాలను కలిసి నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. డిజైన్‌ ఖరారైన తర్వాత మూడు నుంచి మూడున్నరేళ్లలో గుడి నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.  

మరిన్ని వార్తలు