మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు  

13 Jul, 2018 14:10 IST|Sakshi
సరఫరా చేసిన గుడ్లను చూపిస్తున్న ఉపాధ్యాయులు

జయపురం: పాఠశాలలకు రప్పించేందుకు పిల్లలకు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని  నిర్దేశించిన మధ్యాహ్న భోజన పథకం గతి తప్పుతోంది. మొదటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా పాఠశాలల  ఉపాధ్యాయులకు ప్రభుత్వం అప్పగించింది. అయితే దీంతో  అనేక ఇబ్బందులతో పాటు అవినీతి కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో స్వయం సహాయక గ్రూపుల లాంటి కొన్ని సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించారు.

అయితే వారి నిర్వహణలో కూడా విమర్శలు రావడంతో నేడు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను ఓ ప్రైవేట్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఒప్పంద సమయంలో విద్యార్థులకు నాణ్యమైన,  శుభ్రమైన పౌష్టికాహారం అందజేస్తామని  ప్రైవేట్‌ సంస్థ వాగ్దానం చేసింది. కానీ వారు సరఫరా చేసే ఆహారంలో నాణ్యతలేదన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో.. పాఠశాలలకు వారు సరఫరా చేసిన కోడిగుడ్లలో కుళ్లినపోయినవి, పురుగులు ఉన్నవి బయటపడ్డాయి.

జయపురం సెంట్రల్‌ యూపీ స్కూలులో విద్యార్థులకు గురువారం మధ్యాహ్న భోజనం పెడుతున్న సమయంలో గుడ్లు కూడా పెట్టారు. అయితే అవి కుళ్లిపోయినట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ విషయం వారు విద్యావిభాగ అధికారులకు తెలియజేశారు. వెంటనే వారు వచ్చి ఆ గుడ్లను పరిశీలించారు. కుళిపోయి, పురుగులున్న గుడ్ల ఫొటోలను  తీశారు. ఉపాధ్యాయులు గుడ్లను పాత్రికేయులకు చూపించారు. దీనిపై విచారణ జరిపిస్తామని అధికారులు తెలిపారు.   ఇటువంటి ఆహారం తింటే పిల్లల  పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి మరి. 

మరిన్ని వార్తలు