రికార్డు స్థాయిలో బలహీనపడిన రూపాయి

8 Jul, 2013 18:41 IST|Sakshi
రికార్డు స్థాయిలో బలహీనపడిన రూపాయి

ముంబై: డాలర్తో పోల్చితే రూపాయి రికార్డు స్థాయిలో బలహీనపడింది. 61 రూపాయలకు పడిపోయింది. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్కు నిరంతరం డిమాండ్ ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత జూన్ 26న ఇంటర్ బ్యాంక్ ఫాక్ఛ్సేంజ్ మార్కెట్లో డాలర్తో మారకం 60.22 రూపాయలు కాగా, ఈ రోజు రికార్డు స్థాయిలో 61.21 రూపాయలకు దిగజారింది. రూపాయి విలువ పడిపోవడంతో భారత వాణిజ్య వేత్తలు ఆందోళనకు గురౌతున్నారు.


   ఈ ఏడాది  డాలర్ మారకంలో హెచ్చు తగ్గుల వల్ల దేశీయ రూపాయి 10 శాతం మేర నష్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 4.8 శాతంకు చేరిన విషయం తెలిసిందే. పరిస్థితులను బట్టి దిగుమతులను తగ్గించుకోవడం, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా రూపాయి పతనానికి అడ్డుకట్టవేయవచ్చనే అభిప్రాయాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. క్యాడ్ అనుగుణంగా విదేశీ కరెన్సీ అందుబాటులో ఉంచడం కష్టతరంగా మారింది.

మరిన్ని వార్తలు