మరిన్ని భేటీలు అవసరం

1 Jul, 2020 18:45 IST|Sakshi

కొలిక్కిరాని సరిహద్దు వివాదం


సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా భారత్‌, చైనాల మధ్య మంగళవారం జరిగిన సైనికాధికారుల మూడో విడత సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, వివాదం సమసిపోయేందుకు మరిన్ని భేటీలు అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్‌-చైనా సరిహద్దు వెంట వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ భూభాగంలోని చుసుల్‌లో ఇండో-చైనా సైనికాధికారులుమూడో విడత సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, సరైన పరిష్కారం కోసం రానున్న రోజుల్లో సైనిక..దౌత్యాధికారుల స్ధాయిలో మరిన్ని సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

శాంతియుత పరిష్కారానికి, వాస్తవాధీన రేఖ వెంబడి సాధారణ పరిస్థితి నెలకొనేనాల ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ ప్రకారం చర్చలు ముందుకు సాగుతాయని వెల్లడించాయి. సత్వరమే దశలవారీగా ఇరు దేశాల సైనికులు సరిహద్దుల నుంచి వెనక్కిమళ్లడం అవసరమని భారత్‌-చైనాలు గుర్తించాయని తెలిపారు. కాగా జూన్‌ 22న జరిగిన భేటీ సందర్భంగా చర్చలు సామరస్యనపూర్వకంగా సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇరు పక్షాలు ప్రకటించిన క్రమంలో తాజా చర్చలు అసంపూర్తిగా ముగిశాయని పేర్కొనడం గమనార్హం. మరోవైపు చర్చలు సాగుతుండగానే డ్రాగన్‌ సేనలు సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో మోహరించడంతో భారత సేనలు సర్వసన్నద్ధమయ్యాయి. 

చదవండి : చైనాకు భారత్‌ మరో షాక్‌

మరిన్ని వార్తలు