బడ్జెట్ కోసం ప్రజల వద్దకు..

19 Jan, 2016 19:06 IST|Sakshi
బడ్జెట్ కోసం ప్రజల వద్దకు..

రాంఛీ: బడ్జెట్ రూపకల్పన కోసం జార్ఖండ్ ముఖ్యమంత్రి సరికొత్త ఆలోచనకు తెరతీశారు. నేరుగా ప్రజల ముందుకే వెళ్లి వారి సమస్యలు, అవసరాలు ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో ప్రజల అవసరాలను కూర్చాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ప్రభుత్వాధికారులను ఆదేశించారు. దేశంలోని తొలిసారి బడ్జెట్ కు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను సంప్రదించాల్సిందిగా ఆయన సీనియర్ అధికారులకు చెప్పారు.

2016-17న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు, సమస్యలు అందులో చేర్చాలని మార్గనిర్దేశం చేశారు. యోజన బనావో అభియాన్(వైబీఏ) కింద సెక్రటరీ ర్యాంకు గల అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి ఆయా జిల్లాల్లోని పంచాయతీల ప్రజలను సంప్రదిస్తారని ఆయన చెప్పారు. జనవరి 21 నుంచి నాలుగు రోజులపాటు అన్ని ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ప్రజల ఇన్ పుట్ తీసుకుంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు