మీ వాళ్లను మీరే అదుపులో పెట్టండి

9 Jul, 2014 12:26 IST|Sakshi
మీ వాళ్లను మీరే అదుపులో పెట్టండి

లోక్సభలో జరుగుతున్న గందరగోళాన్ని వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలే అదుపు చేయాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. తీవ్ర గందరగోళం కారణంగా లోక్సభ వాయిదాపడి, తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమైనప్పుడు స్పీకర్ ఈ మేరకు అన్ని పక్షాల నాయకులకు సుదీర్ఘంగా ఓ విజ్ఞప్తి చేశారు. సభ జరుగుతున్న తీరును దేశమంతా చూస్తూనే ఉంటుందని, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన గౌరవ సభ్యులు ఇలా ప్రవర్తించడం సరికాదని ఆమె అన్నారు.

ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడం, పదే పదే వెల్లోకి దూసుకు రావడం లాంటివి చేయకుండా, సభ్యులు ఏవైనా సమస్యలను ప్రస్తావించాలనుకుంటే తమ తమ స్థానాల్లోనే నిలబడి ప్రస్తావించాలని కోరారు. వివిధ పార్టీల సభ్యులు ఇలా గందరగోళం సృష్టించకుండా ఆయా పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలే చూసుకోవాలని, అది వారి బాధ్యతే అవుతుందని స్పీకర్ అన్నారు. కాగా, తమ సభ్యులు ముందుకు వచ్చి నినాదాలు చేసిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రైల్వే శాఖ మాజీ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయని, అందువల్ల ముందుగా అధికార పక్షాన్ని నియంత్రించాలని స్పీకర్ను ఆయన కోరారు.

మరిన్ని వార్తలు