1350 పోస్టులకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌

13 Aug, 2019 20:37 IST|Sakshi

భార‌త ప్ర‌భుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖ‌లు/విభాగాలు/సంస్థల కోసం  230 కేటగిరీలకు చెందిన 1351 ఖాళీల  భ‌ర్తీకి కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ప‌ద్ధ‌తిలో రిక్రూట్‌మెంట్‌ను చేపడుతున్నట్లు స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) పత్రికా ప్రకటన విడుదల చేసింది. అర్హ‌త ప్రమాణాలు, ఇత‌ర నియ‌మ నిబంధ‌న‌లతో కూడిన వివ‌ర‌ణాత్మ‌క‌ ప్ర‌క‌ట‌న, ఇంకా ద‌ర‌ఖాస్తు పత్రాలు క‌మిష‌న్ వెబ్‌సైట్‌ ssc.nic.inతో పాటు స‌ద‌రన్ రీజినల్ ఆఫీస్ వెబ్‌సైట్  sscsr.gov.inలో లభ్యం అవుతాయి.

అలాగే చెన్నైలోని ఎస్ఎస్‌సీ స‌ద‌ర‌న్ రీజియ‌న్‌కు సంబంధించి 17 కేట‌గిరీలలో 67 ఖాళీలు కూడా ఇందులోనే ఉంటాయి.  రిజ‌ర్వేష‌న్స్‌కు అర్హ‌త క‌లిగిన ఎస్సీ/ఎస్టీ/ఇఎస్ఎమ్/పీడబ్ల్యుడీ (ఒహెచ్/హెచ్ హెచ్/విహెచ్/ఇతరులు) కేట‌గిరీలకు చెందిన అభ్య‌ర్థుల‌కు, మ‌హిళా అభ్య‌ర్థులకు పరీక్ష పీజు ఉండదు. అర్హులైన అభ్య‌ర్థులు క‌మిష‌న్ వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆగ‌స్టు 31వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.  ఈ ప‌రీక్ష 2019వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 14వ తేదీ నుంచి 2019వ సంవ‌త్స‌రం అక్టోబ‌రు 18వ తేదీ మ‌ధ్య నిర్వ‌హించే అవకాశం ఉంది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా