సుఖేష్ బుట్టలో దినకరన్ ఎలా పడ్డాడో తెలుసా?

24 Apr, 2017 10:57 IST|Sakshi
సుఖేష్ బుట్టలో దినకరన్ ఎలా పడ్డాడో తెలుసా?

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న టీటీవీ దినకరన్.. చాలా తేలిగ్గా బుట్టలో పడిపోయాడట. సుఖేష్ చంద్రశేఖర్ తనను తాను హైకోర్టు జడ్జిగా పరిచేయం చేసుకుంటే నిజమేననుకుని నమ్మేసి ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇప్పించడానికి అతడే సరైన వ్యక్తి అనుకున్నాడట. ఈ విషయం ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఏప్రిల్ 16న సుఖేష్ అరెస్టు కావడానికి సరిగ్గా 20 గంటల ముందు అతడికి దినకరన్ ఫోన్ చేశాడు. రెండాకుల గుర్తు తమకే దక్కాలన్న ఆశతో ఉన్న దినకరన్.. సుఖేష్ బుట్టలో సులభంగా పడిపోయాడు. వరుసగా మూడోరోజు కూడా దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు విచారించనున్నారు. ఆదివారం కూడా అర్ధరాత్రి 1 గంట వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. తమ వద్ద ఉన్న పక్కా సాక్ష్యాలతో దినకరన్‌ను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు.

సుఖేష్‌.. చాలా సుఖ పురుషుడు!

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించిన టీటీవీ దినకరన్.. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒకటైపోయే సూచనలు కనిపించడంతో పార్టీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శశికళ, దినకరన్ కుటుంబ సభ్యులెవరూ పార్టీలో ఉండటానికి వీల్లేదని గట్టిగా డిమాండ్లు రావడంతో దినకరన్ వెళ్లక తప్పలేదు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసులు సుఖేష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీలో అరెస్టు చేయడం, అతడిచ్చిన సమాచారంతో దినకరన్‌కు నోటీసులు పంపడం తెలిసిందే. తాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటానని, అయితే తనను పదవి నుంచి తొలగించాలంటే మాత్రం అది కేవలం ఒక్క శశికళ వల్లే అవుతుందని చెప్పారు. కాగా జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరు జైల్లో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు