నిర్భయ ఘటన : రివ్యూ పిటిషన్‌ విచారణ

7 Jul, 2018 19:48 IST|Sakshi
నిర్భయ తల్లిదండ్రులు

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటన నిందితులకు గతేడాది సుప్రీం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే 2017లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిర్భయ కేసులో దోషుల తరపు లాయర్లు గత మే నెలలో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్‌ను విచారించనుంది. ఇందుకు సంబంధించి సోమవారం(జూలై 9న) తీర్పు వెలువరించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.

కాగా 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు బస్సులో నలుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో కేవలం మూడేళ్ల శిక్ష అనుభవించి స్వేచ్ఛగా బయటకు వెళ్లిపోయాడు. ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్‌లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తలు