ఎమ్మెల్యేల వేతనాలు పెంపు, జనం ఫైర్‌

19 Jul, 2017 14:27 IST|Sakshi
ఎమ్మెల్యేల వేతనాలు పెంపు, జనం ఫైర్‌

చెన్నై: తమిళనాడు ఎమ్మెల్యేల వేతనాలు భారీగా పెరిగాయి. శాసనసభ్యుల నెలవారీ వేతనం రూ.55 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. శాసనసభ్యుల స్థానిక సంస్థల అభివృద్ధి నిధులను రూ. 2 కోట్ల నుంచి రెండున్నర కోట్లకు పెంచినట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస మద్దతు ధర కోసం రైతులు రోడ్డక్కినా ప్రభుత్వం పట్టించుకోదు గానీ.. ఎమ్మెల్యేల వేతనాలు మాత్రం పెంచిందని జనం మండిపడుతున్నారు.

మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తమిళ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు రైతుల ఆందోళనలో కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. అన్నదాతలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు