టీచ‌ర్ అంకిత భావానికి నెటిజ‌న్లు ఫిదా

10 Jun, 2020 16:53 IST|Sakshi

పుణె: అంతా ఆన్‌లైన్‌మ‌యం.. క‌రోనా పుణ్యాన బోధ‌న కూడా మ‌రింత ఆన్‌లైన్ అయిపోయింది. ఎవ‌రింట్లో వాళ్లుంటూనే టీచ‌ర్లు పాఠాలు బోధిస్తుంటే, ఇటు పిల్ల‌లు కూడా అందులోనే అసైన్‌మెంట్‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర‌లోని పుణెకు చెందిన మౌమిత బి అనే ఓ కెమిస్ట్రీ టీచ‌ర్..‌ తాను బోధించే పాఠాన్ని పిల్ల‌‌లు ఎలాంటి డిస్ట‌బెన్స్ లేకుండా చ‌క్క‌గా వినాల‌నుకుంది. ఇందుకోసం ఇంట్లో గోడ‌కు బ్లాక్‌బోర్డ్ ఫిక్స్ చేసింది. (‘నారాయణ’ టీచర్‌.. అరటి పండ్లు అమ్ముకుంటూ)

ఇక వీడియో తీయ‌డానికి ట్రైపాడ్ లేక‌పోవ‌డంతో ఆమె ఓ ఐడియా ర‌చించింది. కుర్చీ, హ్యాంగ‌ర్‌, గుడ్డ ముక్క‌ల‌‌తోనే ట్రైపాడ్ నిర్మించేసింది. ఎంచ‌క్కా బోర్డు క‌నిపించేలా హ్యాంగర్‌కు ఫోన్‌ను క‌ట్టేసి వేలాడ‌దీసింది. అది ఎటూ క‌ద‌ల‌కుండా దాన్ని కింద కుర్చీకి కూడా క‌ట్టేసింది. త‌ద్వారా ఎలాంటి అంత‌రాయం లేకుండా పిల్ల‌ల‌కు సులువుగా బోధిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను అట‌వీశాఖ అధికారి సుధా రామెన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఆమె అంకిత‌భావానికి మంత్ర‌ముగ్ధుల‌వుతూ టీచర్‌ను మెచ్చుకుంటున్నారు. (పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్)

మరిన్ని వార్తలు