ఈ ముళ్ల చెట్టు... వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

19 Apr, 2015 02:05 IST|Sakshi
ఈ ముళ్ల చెట్టు... వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

ఫొటోలో కనిపిస్తున్న ముళ్లచెట్లను మీరు ఎప్పుడైనా చూశారా? మహారాష్ట్రలోని ఫల్టన్ ప్రాంతంలోని నింబ్‌కర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నారీ) అధ్యక్షురాలు నందినీ నింబ్‌కర్ ఈ మొక్క కల్పవృక్షానికి ఏమాత్రం తీసిపోదంటారు. అనడమే కాదు.. ఎక్కడో అమెరికాలోని టెక్సస్ ప్రాంతంలో కనిపించే మేలు రకం మొక్కల్ని తెచ్చి.. పెంచుకోమని రైతులకు పంచుతున్నారు. పెంచి ఏం చేసుకోమూ... అనేనా మీ సందేహం. ఒక్కొక్క ప్రయోజనం వరుసగా... కాయల రుచి అదుర్స్. పైగా మంచి పుష్టినిస్తాయి కూడా.

కాండాలను తీసేస్తే మిగిలిన ఆకుల్లాంటి నిర్మాణాలు నేరుగా పశువుల దాణాగా వాడవచ్చు. లేదంటే నీళ్లు పుష్కలంగా ఉండే ఈ ఆకుల్ని, ఇతర భాగాలను కాస్మోటిక్స్, ప్లైవుడ్ తయారీలో వాడుకోవచ్చు. సోపులు, జిగురు, రంగుల తయారీలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుంది. అధికరక్తపోటుతోపాటు మధుమేహ చికిత్సకు అవసరమైన మందులు తయారు చేసేందుకు ఫార్మా కంపెనీలకూ దీని అవసరముంది. మరిన్ని వివరాలకు... జీఝఛజ్చుటఃజఝ్చజీ.ఛిౌఝ ఐడీకి మెయిల్ చేయండి!
 

మరిన్ని వార్తలు