నెట్‌పై క్లారిటీ ఇచ్చిన యూజీసీ

26 Apr, 2017 20:47 IST|Sakshi
నెట్‌పై క్లారిటీ ఇచ్చిన యూజీసీ

న్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) నిర్వహణపై ఉన్న అనిశ్చితి తొలిగింది. సీబీఎస్‌ఈనే ఈ పరీక్షను నిర్వహిస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్‌, నీట్‌ వంటి ఇతర పరీక్షల నిర్వహణ వల్ల బోర్డుపై అధిక భారం పడుతోందని, అందువల్ల నెట్‌ను నిర్వహించలేమని సీబీఎస్‌ఈ గతేడాది కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఎదుట తన అశక్తతను వ్యక్తపరిచింది. అయితే, దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు.

మరోవైపు జూలై నిర్వహించాల్సిన నీట్‌కు ఏటా ఏప్రిల్‌ మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉండగా.. సీబీఎస్‌ఈ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో అనిశ్చితి నెలకొన్ని విషయం తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలంటూ విద్యార్థులు యూజీసీ ముందు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మానవవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన యూజీసీ అధికారులు సీబీఎస్‌ఈనే జూలైలో పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

 

మరిన్ని వార్తలు