ఫిర్యాదుల స్వీకరణకు అధికారి: వాట్సాప్‌

24 Sep, 2018 06:11 IST|Sakshi

న్యూఢిల్లీ: నకిలీ వార్తలు, వదంతులను అరికట్టేందుకు వాట్సాప్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో నకిలీ వార్తలపై ఫిర్యాదులు స్వీకరించేం దుకు కోమల్‌ లాహిరిని గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ–మెయిల్, యాప్‌ లేదా రాతపూర్వకంగా ఆమెకు ఫిర్యాదు చేయవచ్చని సంస్థ పేర్కొంది. వాట్సప్‌లోని ‘సెట్టింగ్స్‌’ట్యాబ్‌లో ఉన్న ఆప్షన్‌ ద్వారా కంపెనీ సపోర్ట్‌ టీమ్‌ను సంప్రదించాలని,  అవసరమైతే గ్రీవెన్స్‌ అధికారికి సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

మరిన్ని వార్తలు