యమునాలో పెరుగుతున్న ఉధృతి..

18 Aug, 2019 15:07 IST|Sakshi

న్యూఢిల్లీ : యమునా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. హర్యానాలోని హతిని కుంద్ బ్యారేజీ నుంచి 4.30 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో హర్యానా యుమునా నగర్‌ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. పరివాహక ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.

మరోవైపు దిగువన వరద ఉధృతి పెరుగుతుండటంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ.. జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు