‘మా అమ్మనాన్న చచ్చినట్లే లెక్క..లొంగిపోను’

3 Aug, 2017 15:04 IST|Sakshi
‘నన్ను పట్టుకున్నావ్‌గా.. అభినందనలు’
శ్రీనగర్‌: ‘నేను ఎప్పుడైతే మా అమ్మానాన్నలను విడిచిపెట్టి వచ్చానో అప్పుటి నుంచే వారు చనిపోయినట్లు భావిస్తున్నాను. నాకు ఎవరూ లేరు.. ఎలాంటి సెంటిమెంట్లు లేవు. కొన్నిసార్లు నేను ముందడుగు వేశాను. కొన్నిసార్లు మీరు ముందడుగేశారు. ఈ రోజు నన్ను పట్టుకున్నారు. అందుకు మీకు అభినందనలు’ అంటూ కశ్మీర్‌లో మంగళవారం బలగాల చేతుల్లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాది అబు దుజానా అన్నాడు. బలగాలు చుట్టుముట్టి అతడిని లొంగిపోవాలని సూచిస్తూ అతడికి ఫోన్‌ చేయగా చివరిసారిగా దాదాపు తొమ్మిదినిమిషాలు మాట్లాడిన అతడు లొంగిపోయేందుకు నిరాకరించాడు.

పాకిస్థాన్‌కు చెందిన దుజాన ఓ గ్రామంలోని తనకు ఉన్న మిత్రురాళ్లలో ఒకరిని కలిసేందుకు వచ్చినప్పుడు బలగాలు చుట్టుమట్టారు. ఆ సమయంలో అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అతడికి ఫోన్‌ చేయించారు. అయితే, తొలిమాటగా ఎలా ఉన్నారు? అంటై పలకరించి ఆశ్చర్యపరిచిన దుజానా లొంగిపోయేందుకు నిరాకరించాడు. ‘నేను ఎలా ఉన్నాననే విషయం మర్చిపో.. నువ్వెందుకు సరెండర్‌ కావడం లేదు? ఇప్పుడెంత చెత్తగా ఉందో నీకు తెలుసా? ఇదంతా ఓ ఆట.

మీ అమ్మనాన్నల గురించి ఓసారి ఆలోచించు. నీకు సహాయం చేస్తాను.. లొంగిపో.. నువ్వు బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పకుంటే అనవసరం రక్తపాతం జరుగుతుంది. ఇష్టమొచ్చినట్లుగా మీరు చేసే పనులకు కశ్మీరు ప్రజలు ప్రాణాలుకోల్పోవాల్సి వస్తుంది’ అని ఆఫీసర్‌ అనగా.. నేను ఈ రక్తపాతాన్ని సృష్టించలేదు.. దీనంతటికి ఎవరు కారణమో నాకు తెలుసు’ అని అతడు అన్నాడు. అయితే, ఇది జిహాద్‌ కాదు.. అని బదులివ్వగా ‘అది కాక ఏంటి ఇది’ అంటూ అతడు ఫోన్‌ కట్‌ చేశాడు. ఈ క్రమంలోలోనే బలగాలు జరిపిన కాల్పుల్లో మృత్యువాతపడ్డారు.
మరిన్ని వార్తలు