స్వచ్ఛందం అంటేనే మిథ్య

29 Mar, 2016 01:25 IST|Sakshi
స్వచ్ఛందం అంటేనే మిథ్య

జ్ఞాపకశక్తి కాస్త అధికంగా ఉన్నవాళ్లు, స్వాతంత్రోద్యమంలో నాయకులకు మల్లే స్వచ్చంద సేవకులు -వలంటీర్లు- కూడా అగ్ర భాగాన ఉండటాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు. తర్వాత వీరే స్వాతంత్య్ర సమరయోధులుగా అందరికీ పరిచితులయ్యారు. పోరాడు అనే పదం పోరాటాన్ని నొక్కి చెబుతుంది తప్ప హింసను కాదు. ఎందుకంటే పోరాటం అనేది అహింసాత్మకమైనది. చాలా వరకు ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉండేవారు. ఒక లక్ష్యం కోసం పార్టీలతో చేతులు కలిపే ఇలాంటి వలంటీర్లను కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల నేతలు నేడు కార్యకర్తలు అని పిలుస్తు న్నారు.
 
 గతంలో స్వచ్చంద వాదం మూలాలు ఒక లక్ష్యం పట్ల, దాని నేతల పట్ల విశ్వాసం, నిబద్ధత, గౌరవంతో కూడి ఉండేవి. కానీ సమకాలీన ప్రజాజీవితంలో ఒక వర్కర్‌ని, కార్యకర్తను నిర్వచించడం కష్టం. వాస్తవానికి వారు ఎవరు? వీరు దాదాపుగా రాజకీయ పార్టీల సభ్యులు కారు. ఏ రాజకీయ పార్టీ వద్ద కూడా నేడు నిజ మైన సభ్యుల జాబితా ఉండదు. కాంగ్రెస్ పార్టీ మాదిరే ఇతర పార్టీల సభ్యుల జాబితాలు కూడా బోగస్‌వే. అలాగే పార్టీ సభ్యత్వ రుసుము రసీదు లు కూడా నకలీవే. భారతీయ జనతా పార్టీ అయితే తాను సూచించిన ఒక మొబైల్ నంబర్‌కి మిస్డ్ కాల్ చేసే ఎవరయినా సరే తన సభ్యులుగానే గుర్తిస్తోంది. సీపీఎం కార్యకర్తలు ఆ పార్టీ సభ్యులు. శివసేన విషయానికి వస్తే పార్టీపట్ల నమ్మకం ఉండేవారందరూ దాని సభ్యులే.
 
 సీపీఎం, శివసేన కేడర్‌గా ఉండేవారు గటి నమ్మకస్తులు. పార్టీ లక్ష్యంకోసం వీరు తమ ప్రయోజనాలను కూడా పక్కనబెట్టి కృషి చేస్తారు. శివసేన లేదా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కండబలాన్ని ఉపయోగిం చాలని పిలుపునిస్తే దాని సభ్యులు తప్పకుండా పాటిస్తారు. ఒకసారి వారు తమ కండబలాన్ని ప్రదర్శించినట్లయితే, స్థానికంగా వారిని ఎంతగానో గౌరవిస్తారు, పార్టీ దొంతర్లలో పైకి తీసుకువస్తారు.
 
 వలంటీర్లు అంటే డబ్బులు పుచ్చుకోకుండా ఒక లక్ష్యంకోసం నిలిచే సహాయకులు. అదే లక్ష్యం కోసం ముందుకొచ్చే ఇతరులకు టీ అందించే పనికి కూడా వీరు ముందుకొస్తారు. కానీ వర్తమాన రాజకీయ ప్రపంచంలో ఈ పదం దాని నిజమైన అర్థంలో ప్రతిధ్వనించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక లక్ష్యం లేదా కార్యక్రమానికి హాజరవుతున్నవారు డబ్బులు పుచ్చుకోకుండా ఉండటం లేదు.
 
 అందుకే ఇలా సభల్లో, పార్టీ కార్యక్రమాలకు జనాలను తీసుకువచ్చేవారని కార్యకర్తలుగా వరి ్ణస్తూనే, అవసరమైనప్పుడు వారికి డబ్బు చెల్లిస్తుం టారు. తక్కిన సమయాల్లో నాయకులు వెలిగి పోతుంటారు, కార్యకర్తలు మాత్రం పరాయి వారుగా కనిపిస్తుంటారు. 2దశాబ్దాల క్రితం, ముంబైనుంచి లోక్‌సభకు ఎన్నికైన ఒక అభ్యర్థిని, ఆయనకు మద్దతుగా ఊరేగింపు చేసేవారు అంత సాదాసీదాగా ఎందుకు కనిపిస్తున్నారని అడి గాను. గుడిసెవాసులైన వారు రోజు కూలీ కింద తన కార్యక్రమాలకు వస్తుంటారని ఆయన చెప్పారు. ఇలా శివార్లలో ఉండే మేస్త్రీలు, చేతివృత్తుల వారు, తదతరులు తమకు రోజు కూలీ ఇచ్చే యజమాను లకు ఎదురు చూస్తూ కనిపిస్తుంటారట.
 
 పొడవాటి రహదారులమీదుగా నినాదాలు చేస్తూ, మండుటెండలో సుదీర్ఘ కాలం పాటు నడిచి వచ్చే పార్టీ కార్యకర్తలను కనుగొనడం ఇవ్వాళ చాలా కష్టమని ఆయన వివరించారు. ఒక ప్రదర్శనను నిర్వహించాలంటే రోజుకూలీలను తెచ్చుకోవడం చాలు సులువని ఆయన అభి ప్రాయం. వారిని ప్రదర్శన కోసమే తీసుకు వస్తున్నప్పుడు వాళ్లెవరు అనేది పెద్ద విషయం కాదు మరి. ఇక్కడ నిజానిజాలకు ఏమంత పట్టించుకోదగినవి కాదు. అది పదిమందికి కనిపించే ప్రదర్శన మాత్రమే. ఇక ట్రక్కులలో ప్రజలను భారీగా తరలించుకుని వచ్చేవారిని ప్రజానేతలని మనం కూడా భావిస్తుంటాము.
 
 భోజనం పెడతామని, డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఒక ఊరేగింపుకు తమను తీసుకువచ్చేవారు ఆ ఊరేగింపు ముగిసిన తర్వాత తమను గాలికి వదిలేస్తారని ఆరోపణలు చేసేవారిని మనం ఎంతమందిని చూడలేదు మరి. ఊరేగింపును ఉద్దేశించి ప్రసంగించే నేత తన ఎదురుగా సభ కిక్కిరిసి ఉండటాన్ని చూస్తాడు. ఇక మీడియా దాన్ని భారీ బహిరంగ సభగా వర్ణిస్తుంటుంది. ఇది ప్రజారాసులను కూడగట్టడం ద్వారా ప్రజలను నమ్మించే స్వభావానికి ఒక వ్యక్తీకరణ. అయితే శరద్ జోషి షేత్కార్ సంఘటన ఇలాంటిది కాదు. వీరు నిర్వహించే సభలకు రైతులు తమ స్వంత ఖర్చులతో వస్తుంటారు.
 
 ఇక రెండో అంశం ఉంది. ఈమధ్యే ఒక ఎన్జీవోపై విచారణకు సంబంధించిన వార్త మీడియాలో వచ్చింది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేయడానికి గాను తాము రోజుకు ఒక్కొక్కరికి రూ.200 లు చెల్లించి మరీ తీసుకొచ్చినట్లు విదేశీ నిధి రుసుములు చూపినట్లు ఆ ఎన్జీవోపై ఆరోపణలు వచ్చాయి. విదేశీ నిధుల క్రమబద్దీకరణ చట్టం 2010 ప్రకారం, డబ్బు చెల్లించి జనాలను సమీకరించి ధర్నాలు నిర్వహించడం చట్టవిరుద్ధం. అయితే విదేశీ నిధుల క్రమబద్దీకరణ చట్టం ముసాయిదా రూపొందించినవారికి ఇలా డబ్బు చెల్లించి సభలకు జనాలను తీసుకువచ్చే పద్ధతి ఉనికిలో ఉందని స్పష్టంగానే తెలుసు.
 
నిజానికి ధర్నాలు వంటి వాటికి ఉపయోగపడే వలంటీర్లను ప్రభుత్వేతర సంస్థలు కలిగి ఉండవు. అంటే పార్టీకి వెన్నెముకగా కనిపించే వారు నిజంగా చెమటోడ్చి పనిచేసే వారు కారు. అలా చమటోడ్చేవారిని చోటా మోటా నేతలు ఇతరులకు అవుట్ సోర్స్ చేస్తుం టారు. అయితే సర్పంచ్ కావచ్చు లేదా ఎంపీ కూడా కావచ్చు.. నాయకుడితో ఉండి జనాలను తీసుకువచ్చే ఈ తరహా సంస్కృతిలో ఇలాంటి వారే పార్టీ శ్రేణులలో పై స్థానాలకు ఎగబాకుతూ ఉంటారు. ఎందుకంటే వీరికి నాయకులతో సాన్ని హిత్యం ఉంటుంది. ఇక పేలవమైన రాజకీయ కార్యకర్త అంటారా? అతడెవరు? ఎన్జీవోలు కూడా సరిగ్గా ఈ విషయంపైనే అప్పీలు చేస్తుంటాయి. ఇదీ మన రాజకీయ పార్టీల కార్యకర్తలకు సంబంధించిన వాస్తవ చిత్రణ.    

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
- మహేష్ విజాపుర్కార్
 ఈమెయిల్: mvijapurkar@gmail.com

>
మరిన్ని వార్తలు