గ్రహం అనుగ్రహం (04-01-2017)

4 Jan, 2017 00:11 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (04-01-2017)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు పుష్యమాసం,
తిథి శు.షష్ఠి ప.12.34 వరకు, తదుపరి సప్తమి,
నక్షత్రం పూర్వాభాద్ర ప.3.17వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,
వర్జ్యం రా.12.30 నుంచి 2.03 వరకు,
దుర్ముహూర్తం ప.11.43 నుంచి 12.34 వరకు
అమృతఘడియలు ఉ.7.28 నుంచి 9.03 వరకు

సూర్యోదయం      :  6.33
సూర్యాస్తమయం  :  5.43
రాహుకాలం       :  ప 12.00 నుంచి 1.30 వరకు
యమగండం      :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: ధనవ్యయం. కుటుంబ,ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

కర్కాటకం: శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు,ఉద్యోగాలలో  నిరాశ.

సింహం: కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వృత్తి,వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తివృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: రుణాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: ఆస్తి వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. కష్టపడ్డా ఫలితం ఉండదు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వృత్తి,వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుంభం: కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు