మోదీకి వ్యతిరేకంగా ఆందోళన

14 Feb, 2018 05:16 IST|Sakshi

రైల్వేస్టేషన్‌లో పకోడి పంపీణీ చేసి డైఫీ నిరసన

సేలం: చదువుకున్న యువకులు పకోడీ విక్రయించైన బతకవచ్చని తెలిపిన మోదీ వ్యాఖ్యను ఖండిస్తూ సేలం రైల్వేస్టేషన్‌లో డైఫీ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం సేలం రైల్వే స్టేషన్‌లో పకోడి పంపిణీ చేశారు. తర్వాత స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆందోళనకారులు పోలీసులను పక్కను తోసివేసి రైల్వే స్టేషన్‌లోకి చొరబడి, రైల్వే పట్టాలపై బైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో యువకులకు అవకాశం కల్పించాలి, రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాని విరమించాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు 63 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.
 రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్న డైఫీ నేతలు, కార్యకర్తలు

మరిన్ని వార్తలు