కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌!

10 Aug, 2019 09:47 IST|Sakshi

జార్ఖండ్‌ పీసీసీ చీఫ్‌ రాజీనామా

నేరస్తులే నయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు

రాంచి : ఇప్పటికే నాయకత్వ లేమి, ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో నాయకుల వ్యాఖ్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. తోటి నాయకుల అవినీతిని భరించలేకపోతున్నానంటూ జార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డారు. నేరస్తుల కంటే నీచంగా ప్రవర్తిస్తున్న పార్టీ సభ్యులతో వేగలేనని.. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా రాహుల్‌ గాంధీ సహా పలువరు సీనియర్‌ నాయకులకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అజయ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘ నేను అవినీతిని అస్సలు సహించను. కాబట్టి నా రాజీనామాను ఆమోదించండి. కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను. గతంలో అధికార పార్టీగా, ప్రతిపక్షంగా ప్రజల మన్ననలు అందుకున్నాం. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కేవలం అధికారం కోసం కొంతమంది కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులు టికెట్లను అమ్ముకుంటున్నారు. ఎన్నికల పేరు చెప్పి బాగా సొమ్ము చేసుకుంటున్నారు. యువకుడిగా ఉన్న సమయంలోనే ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న పోలీసు అధికారిగా నేను వీటిని సహించలేను.

నా ఉద్యోగ జీవితంలో చూసిన ఎంతో మంది దిగజారిన, కరడుగట్టిన నేరస్తుల కంటే వీరు హీనంగా ఉన్నారు. వారి విధానాలు మార్చుకోమని ఎంతగానో చెప్పిచూసినా లాభం లేకపోయింది.ఇక బాధ్యతల నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. అందుకే రాజీనామా చేస్తున్నా అని అజయ్‌ కుమార్‌ సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో, సమర్థులకు టికెట్లు ఇవ్వడంలో నిజాయితీగా వ్యవహరించాలనుకుంటే వారంతా మోకాలు అడ్డారు’ అని ఆరోపించారు. అయితే పార్టీలో కొంతమంది నిజాయితీగానే ఉన్నారని, వారి పట్ల తనకు గౌరవభావం ఉంటుందన్నారు. కాగా అజయ్‌ కుమార్‌ గతంలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి లోక్‌సభ ఎంపీగా పనిచేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌కు ‘సీనియారిటీ’ కష్టాలు..!

జైట్లీ కుటుంబసభ్యులకు వెంకయ్య పరామర్శ

టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న ఎంపీ కేశినేని!

నేడే సీడబ్ల్యూసీ భేటీ

బీజేపీ కొత్త ఎన్నికల ఇన్‌చార్జులు

అక్కడ మెజారిటీ లేకే!

రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం

బీజేపీలోకి మాజీ ఎంపీ; కేసీఆర్‌పై విమర్శలు

వేలూరులో డీఎంకే ఘనవిజయం

అమిత్‌ షా సమక్షంలో బీజేపీలోకి వివేక్‌

టీడీపీలో వేరుకుంపట్లు

‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’

సంయుక్త పార్లమెంటరీ కమిటీకి విజయసాయిరెడ్డి ఎన్నిక

ఎంపీడీవో.. నీ అంతు చూస్తా

అగ్ర కులాల పెత్తనం ఇంకెన్నాళ్లు: వీహెచ్‌

లోకేశ్‌కు మతి భ్రమించింది : రోజా

‘త్వరలోనే 10,224 లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల భర్తీ’

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

ఆవు కాదు.. దున్నపోతని తెలిసి ఓడించారు

ఆర్టికల్‌ 370 రద్దు: దిగొచ్చిన జేడీయూ

రాష్ట్ర పథకాలకు కేంద్రం సహకరించాలి : ఈటల

‘కశ్మీర్‌’పై ట్వీట్లు, స్వీట్లకే పరిమితమా!?

సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి

'కశ్మీర్‌ను ఓట్ల కోసమే వాడుకున్నాయి'

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఆజాద్‌కు చుక్కెదురు

అందుకే కరీంనగర్‌లో ఓడిపోయాం: కేటీఆర్‌

పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?

సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?

లోక్‌సభలో మన వాణి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌