సీఎంగా సోరెన్‌ ప్రమాణం.. హేమాహేమీలు హాజరు

29 Dec, 2019 14:22 IST|Sakshi

రాంచీ :  జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ బాధ్యతలు స్వీకరించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ,  ముఖ్యమంత్రులు కమల్‌నాథ్‌ (మధ్యప్రదేశ్‌), భూపేశ్‌ బఘేల్‌ (ఛత్తీస్‌గఢ్‌), అశోక్‌ గెహ్లోత్‌ (రాజస్తాన్‌), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), డీఎంకే అధినేతి ఎంకే స్టాలిన్‌, అఖిలేష్‌​ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. ఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్‌ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయి.

మరిన్ని వార్తలు