కష్టపడే మంత్రి అయిన

23 Sep, 2018 02:50 IST|Sakshi

ట్విట్టర్‌లో ఉత్తమ్‌కు కేటీఆర్‌ కౌంటర్‌  

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కావడానికి ముందు తాను 8 ఏళ్లు తెలంగాణ పోరాటంలో పనిచేశానని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని చెప్పుకోవడం చూస్తే భారత్‌కి ఫ్యూడల్‌ బ్రిటిషర్లు స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తండ్రి కేసీఆర్‌ కారణంగా వడ్డించిన విస్తరిలో అన్నీ పొందిన కేటీఆర్‌ తరహాలో కాకుండా తాను కష్టపడి పని చేసి ప్రస్తుతమున్న స్థానానికి చేరుకున్నానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుకు మంత్రి కేటీఆర్‌ పైవిధంగా స్పందించారు. రాహుల్‌ గాంధీ ప్రతిదీ వడ్డించిన విస్తరిలో పొందిన తరహాలోనా? అని కేటీఆర్‌ తిప్పికొట్టారు.

కాంగ్రెస్‌ వల్లే అధికారం..
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేటీఆర్, ఆయన కుటుంబానికి ఈ రోజు పదవులు దక్కాయని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్‌ పాత్ర ఉందని చెప్పడం పెద్ద అబద్ధమని విమర్శించారు.

మరిన్ని వార్తలు