అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్‌: ప్రధాని మోదీ

10 Feb, 2019 11:59 IST|Sakshi

గుంటూరు : ‘ఏపీ అక్షర క్రమంలో తొలిస్థానంతో పాటు అన్ని రంగాలలో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు, పద్మభూషణ్, దళిత కవి గుర్రం జాషువా, మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం...’  అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గుంటూరులో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ఆయన తొలిగా ప్రసంగం చేసి, అనంతరం హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య, డాక్టర్ నాయుడమ్మను కూడా ప్రధాని ప్రస్తావించారు.

ఎంతోమంది ప్రముఖులను జాతికి అందించిన గడ్డ గుంటూరు అని, అమరావతి ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్ అని ప్రధాని వ్యాఖ్యానించారు. గుంటూరు సమీపంలో ఉన్న అమరావతికి ఎంతో చరిత్ర ఉందని, ఇప్పుడు అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా ఎదుగుతుందని అన్నారు. అమరావతిని హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. మీరు నాపై ఎంతో ప్రేమ ...నిరంతరం పనిచేసేలా తనకు ప్రేరణ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సభా స్థలి నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్‌జీసీ, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు